రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న గ్రామ, వార్డు సభలు రసాభాసగా మారుతున్నాయి. అధికారులు, కాంగ్రెస్ నేతల తీరుపై భగ్గమంటున్నారు. ఓ వైపు మహిళలు, యువత సైతం గ్రామసభలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అర్హులను కాకుండా అనర్హులకు ఎలా ప్రభుత్వ పథకాలు వర్తింప జేస్తారని, తమ పేర్లు కాకుండా అనర్హుల పేర్లను జాబితాలో ఎలా చేరుస్తారంటూ ఫైర్ అవుతున్నారు.
తాజాగా సొంతపార్టీ నేతలే కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలోని కీసరలో బుధవారం వెలుగుచూసింది. ఇందిరమ్మ కమిటీ వేసిన వారికి సిగ్గుందా? అంటూ తోటి కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. ‘కీసర గ్రామ ఇందిరమ్మ కమిటీలో తాము ఇచ్చిన పేర్లు కాకుండా వారికి ఇష్టమైన పేర్లు రాశారు. వీళ్లకు సిగ్గుందా? అంటూ’ తోటి కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ కమిటీ వేసిన వారికి సిగ్గుందా అంటూ తోటి కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం
మేడ్చల్ జిల్లా కీసర గ్రామ ఇందిరమ్మ కమిటీలో తాము ఇచ్చిన పేర్లు కాకుండా వారికి ఇష్టమైన పేర్లు రాశారు.. వీళ్లకు సిగ్గుందా అంటూ తోటి కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం pic.twitter.com/epKLVgm8ZJ
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2025