క్యాన్సర్ ను సైతం అడ్డుకునే యాలకులతో బోలెడు ప్రయోజనాలు..!

-

వంటింటి సుగంధ ద్రవ్యాలలో మొదటి ప్రాముఖ్యత యాలకులదే అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. యాలకులు మంచి సువాసన, రుచిని అందివ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఎక్కువగా తీపి పదార్థాలు తయారు చేసేటప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అంతేకాదు బిర్యానీ వంటి మసాలా ఐటమ్స్ లో కూడా యాలకులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆహారం త్వరగా జీర్ణం అవ్వాలి అంటే యాలకులు చాలా చక్కగా పనిచేస్తాయి. ఇకపోతే ఈ యాలకులు చూడడానికి చిన్నగా ఉన్నా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా నయం చేయడంలో సహాయపడతాయి.అంతేకాకుండా క్యాన్సర్ కారక కణాలపై పోరాడుతుంది. ఫలితంగా క్యాన్సర్ కణితులను పెరగకుండా అడ్డుకుంటాయి.

యాలకుల్లో ఉండే రసాయన సమ్మేళనాలు నోటిలో బ్యాక్టీరియాపై చాలా ప్రభావంతంగా పోరాడుతాయి. రోజు క్రమం తప్పకుండా రెండు యాలకులను వేసుకొని నమిలితే నోటి దుర్వాసన పోయి.. చిగుళ్ళు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి ఇన్ఫెక్షన్లు కూడా వ్యాప్తి చెందవు. యాలకుల్లో విటమిన్ సి ఉంటుంది.ఇది మన చర్మానికి రక్తప్రసరణ మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. చర్మం కాంతివంతంగా, సున్నితంగా మార్చేందుకు యాలకులు ఉపయోగపడతాయి.చర్మంపై ఏర్పడే ముడతలను తొలగించి చర్మానికి నిగారింపును తీసుకువస్తుంది.

యాలకులను నమిలి తినడం వలన వచ్చే ఎక్కిళ్ళు నుండి ఉపశమనం కలుగుతుంది. ఆకలి వేయకపోవడం, రుచించకపోవడం వంటి సమస్యల్ని యాలకలు నివారిస్తాయి.డిప్రెషన్ తో బాధపడే వారికి యాలకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. డయాబెటిస్ ను కూడా యాలకులు కొంతమేర అదుపులో ఉంచగలవు. వీటిలో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం రాకుండా అడ్డుకునే గుణాన్ని కలిగి ఉంది. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు యాలకులను తలుచుగా తీసుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.

అలాగే యాలకులలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాదు ఇందులో ఉండే పొటాషియం గుండె పనితీరును మెరుగుపరిచి.. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.. అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి ని కూడా తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version