LOVE FAIL : డిప్రెషన్‌తో యువకుడి ఆత్మహత్య

-

ప్రేమలో మోసపోయామని, ప్రియురాలు మోసం చేసిందని ఇటీవలి కాలంలో చాలా మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు ప్రేమకోసం ఇన్నాళ్లు ప్రేమించిన ప్రియురాలినే చంపేందుకు ప్రేమోన్మాదిలా మారి హత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమలో ఓడిపోయామని డిప్రెషన్‌కు గురై కొందరు మద్యానికి బానిస అవుతుంటే మరికొందరు ఏకంగా ప్రాణాలు తీసుకుంటుంటారు.

హైదరాబాద్‌లోని అత్తాపూర్ పీఎస్ పరిధిలో ప్రేమలో విఫలం అయ్యానని సాయికుమార్ (19) అనే యువకుడు గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది రోజులుగా అతను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మృతుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఎలక్ట్రిషన్ పనిచేసుకుంటూ చదువుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version