భర్తతో గొడవ.. ముగ్గురు పిల్లలతో తల్లి అదృశ్యం

-

భర్తతో గొడవ కారణంగా ఓ వివాహిత తన ముగ్గురు పిల్లలతో కలిసి కనిపించకుండా పోయింది. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాలానగర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం.. బాలానగర్‌లో నివాసముంటున్న లావణ్య, నాగపురి రాజు దంపతులు తరచూ గొడవపడేవారు. ఎప్పటిలాగే బుధవారం కూడా ఇంట్లో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన వివాహిత తన ముగ్గురు పిల్లలను తీసుకుని చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బంధువులకు కాల్స్ చేసినా, బయట ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో చివరకు భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version