శృంగార ప్రియులకు మాత్రం 2020 మర్చిపోలేని ఏడాది..ఎందుకంటే

-

శతకోటి దరిద్రాలను మిగిల్చిన సంవత్సరం… దరిద్రపుగొట్టు ఏడాది.. ఛీ ఛీ ఇలాంటి 2020 ఇయర్‌ మరోసారి రాకూడదని అనుకోనివాళ్లు లేరు. ఆర్థిక వ్యవస్థల్ని కుప్పకూల్చి… లక్షలాది మంది ప్రాణాలను బలిగొని.. ఈ ప్రాభావం నుంచి ఇంకా కోలుకోనివ్వకుండా చేసింది 2020. ఓవరాల్‌గా ఈ ఏడాది విషాదమయం అయినప్పటికీ… శృంగార ప్రియులకు మాత్రం మంచి అనుభూతినిచ్చిందట.

కరోనాని కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ కొన్నిదశల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. మెల్లమెల్లగా ఒక్కొక్కటి తెరుచుకుని సాధారణ స్థితికి వస్తున్నా… పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌, విద్యాసంస్థలతోపాటు కొన్ని కీలక సంస్థలు ఇంకా తెరుచుకోలేదు. ఐటీ కంపెనీలు వచ్చే ఏడాది కూడా వర్క్‌ ఫ్రం హోమ్‌ కొనసాగించేలా ఉన్నాయి.

కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లో సాగుతుండటంతో.. ఈ మార్పును క్యాష్‌ చేసుకున్నాయి కొన్ని సర్వీస్‌ సంస్థలు. లాక్‌డౌన్‌ టైంలో పట్టపగలే శృంగార కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయట. జనం బయట తిరిగే అవకాశం లేకపోవడంతో… ఆన్‌లైన్‌ ఆర్డర్లకు విపరీతమైన డిమాండ్‌ లభించింది. ఆన్‌లైన్లో కండోమ్స్‌ ఆర్డర్స్‌ గతంకంటే రెట్టింపయ్యాయట. స్ట్రిక్ట్‌ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలోనూ… మెడికల్‌ సంబంధిత వస్తువులు అందుబాటులో ఉన్నాయి. జనం కొనుగోలు చేసిన వస్తువుల్లోనూ కండోమ్స్‌, ఐపిల్స్‌ షేరే ఎక్కువ అట.

కండోమ్స్‌ , గర్భనిరోధక మాత్రలైన ఐపిల్‌, పేపర్‌ రోల్స్‌ డెలివరీలు ఐదారింతలు పెరిగిపోయాయని చెప్తోంది ప్రముఖ ఆన్‌లైన్‌ సర్వీస్ యాప్‌ డుంజో. ఆన్‌లైన్‌ కస్టమర్ల బిహేవియర్‌పై ఓ రిపోర్టు విడుదల చేసింది. ఆన్‌లైన్‌ డెలివరీ ట్రెండ్‌ 2020 ప్రకారం ఈ ఏడాదిలో రాత్రిపూట కంటే.. పగటిపూటే కండోమ్స్‌ ఆర్డర్‌లు సగటున మూడింతలు పెరిగాయట.

డుంజో యాప్‌ ద్వారానే.. ఈ స్థాయిలో పగటిపూట కండోమ్స్‌ కొన్నారంటే.. మిగతా అన్ని యాప్‌లను కలిపితే లాక్‌డౌన్‌లో పగటిపూట రతిక్రీడలు ఏ స్థాయిలో జరిగాయో ఊహించుకోవచ్చు. కండోమ్స్‌ మాత్రమే కాదు… అవి వాడకుండా సెక్స్‌లో పాల్గొన్నవాళ్లు కుటుంబ నియంత్రణ ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేసినట్లు సర్వే రిపోర్ట్‌ చెప్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా కండోమ్స్‌, కాంటర్సెప్టివ్‌ ఐపిల్స్‌ వంటి వాటి గిరాకీ మూడింతలు పెరిగితే.. హైదరాబాద్‌లో మాత్రం ఒక్క కండోమ్స్‌ గిరాకీనే అది కూడా పగటిపూట ఆర్డర్లు ఆరింతలు పెరిగాయట. లాక్‌డౌన్‌లో భాగ్యనగరం కాస్త.. శృంగార రాజధానిగా వర్ధిల్లింది.

హైదరాబాద్‌లో 6 రెట్లు, చెన్నైలో 5 రెట్లు, జైపూర్‌ సిటీలో నాలుగు రెట్లు కండోమ్‌ కొనుగోళ్లు పెరిగినట్టు చెప్తోంది డాంజో. బెంగుళూరులో మాత్రం… పొగాకు, డ్రగ్స్‌ను సిగరెట్లుగా చుట్టిపీల్చే రోలింగ్‌ పేపర్‌ వాడకం విపరీతంగా పెరిగిందని సర్వే మాట. చెన్నైకంటే.. బెంగుళూరులో 22 రెట్లు ఎక్కువగా రోలింగ్‌ పేపర్ల ఆర్డర్లు వచ్చాయట.

లాక్‌డౌన్‌ సమయంలో.. రాత్రిపగలు రతిక్రీడలు పెరిగిన కారణంగా వచ్చే ఏడాది సాధారణం కంటే ఎక్కువ మంది బిడ్డలు పుట్టనున్నట్లు అంతర్జాతీయ సంస్థలు సైతం రిపోర్ట్‌లు విడుదల చేస్తున్నాయి. సాధారణంగా రాత్రి సమయాల్లో సాగే సెక్స్‌ కార్యకలాపాలు లాక్‌డౌన్‌ టైంలో పగటిపూటే కొనసాగాయి. ఇవన్నీ పక్కనపెడితే.. భార్యభర్తల మధ్య తగువులాటలు తగ్గి ప్రేమాభిమానాలు పెరిగాయట. మానవ సంబంధాలు మెరుగుపడ్డాయట. కరోనా ఎంత నష్టం తెచ్చినా.. ఇలాంటి విషయాల్లో ఒకింత మేలే చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version