రేపు లవ్ స్టోరీ ట్రైలర్ విడుదల..!

ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో లవ్ స్టోరీ సినిమా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. రీసెంట్ గా ఈ సినిమాను ఈనెల 24వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం స్పష్టం చేసింది.

love story movie
love story movie

రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు సినిమా ట్రైలర్ విడుదల చేస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కించగా హీరో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సారంగదరియా పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దాంతో ఈ పాటకోసం అయిన సినిమా చూడాలని ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల కు ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు. ఇక ఇప్పటికే టీజర్, సారంగదరియా పాట ఆకట్టుకోగా ట్రైలర్ ఏమేరకు అలరిస్తుందో చూడాలి.