Love Story: చైతూ.. సాయిప‌ల్ల‌విల మ్యాజిక్ వర్కౌట్‌ .. తొలి రోజు వసూలు ఎంతంటే..!

-

Love Story: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya), న్యాచుర‌ల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi)లు జంటగా నటించిన లవ్‌స్టోరీ (Love Story). శేఖ‌ర్ క‌మ్ముల దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. సూపర్ క్రేజ్‌తో, భారీ అంచనాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం.. విడుదలైన తొలిరోజే.. అనూహ్యమైన వసూళ్లతో బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు నెల‌కొల్పింది.

కరోనా సెకండ్‌వేవ్ తరువాత ప్రేక్ష‌కులు థియేటర్స్‌కు రావ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. ఓటీటీల్లోనే సినిమాలు చూస్తూ.. థీయేట‌ర్ల‌ల్లో సినిమాలు చూడటానికి జంగుతున్న వేళ .. భారీ బ‌డ్జెట్ తో, ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన లవ్‌ స్టోరీ సినిమా ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్ వైపు అడుగుపెట్టియ‌డంలోనూ స‌క్సెస్ అయ్యింది. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా వెండి తెరపై సందడి చేస్తుంది. అంతే కాకుండా సినిమా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్లను రాబడుతోంది.

ల‌వ్‌స్టోరీ సినిమా చూడ‌టానికి.. అడ్వాన్స్ బుకింగ్స్‌తో ప్రేక్షకులు థియేటర్ల‌కు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఓవ‌ర్‌సీస్‌లోనూ కూడా లవ్ స్టోరీ స‌క్సెస్ సాధించింది. అమెరికాలో 224 లొకేష‌న్స్‌లో ల‌వ్‌స్టోరి ప్రీమియ‌ర్స్ వేస్తే.. 3,07,103 డాల‌ర్స్ వసూలు చేసింది. ఇక తొలిరోజు 2,34,000 డాల‌ర్స్ వ‌సూళ్ల‌ను సాధించింది. ప్రీమియర్స్‌తో కలుపుకుని మొత్తంగా 540000 డాల‌ర్స్ కొల్ల‌గొట్టింది ల‌వ్‌సోర్టీ.

అంటే మన దేశ కరెన్సీలో మొత్తంగా రూ.4.40కోట్ల కలెక్షన్లు రాబట్టి.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంత భారీ ఓపినింగ్ కలెక్షన్ల రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో చైతూ, సాయి పల్లవులు పోటాపోటీగా నటించారని.. సాంగ్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయ‌ని, స్టోరీ కూడా సినిమాపై భారీ అంచానాలు పెంచేశాయని.. అంచనాలకు తగినట్లుగానే కలెక్షన్లు ఉన్నాయని ట్రేడ్ వర్గాల మాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version