సారంగ‌ద‌రియా కోసం ల‌వ్ స్టోరీ రెండు సార్ల‌యినా చూస్తా : మెగాస్టార్

-

లవ్ స్టోరీ సినిమా నుండి విడుద‌లైన సారంగ‌ద‌రియా పాట‌కు ఎంత‌టి రెస్పాన్స్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. ఈ పాట విడుద‌లైన నాటి నుండి యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇక ఈ సాంగ్ తో సాయి ప‌ల్ల‌వి కూడా తన రికార్డుల‌ను తానే తిర‌గ‌రాసుకుంది. ఇక సారంగ‌ద‌రియా ఇప్ప‌టికే ఎంతో మంది ప్ర‌శంస‌లు కురింపించ‌గా తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్ర‌శంసించారు. మెగా స్టార్ ఈ రోజు ల‌వ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు వ‌చ్చారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ… ల‌వ్ స్టోరీ టీజ‌ర్ ట్రైల‌ర్ లు ఎంతో న‌చ్చాయ‌ని.Megastar Chiranjeevi resign to MAA

ముఖ్యంగా సినిమా పాట‌లు త‌న‌కు భాగా న‌చ్చాయ‌ని చెప్పారు. ల‌వ్ స్టోరీ సినిమాను సారంగ‌ద‌రియా పాట కోస‌మైనా రెండు మూడు సార్లు చూస్తాన‌ని మెగాస్టార్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ సూప‌ర్ అని మెగాస్టార్ అన్నారు. నాగ చైత‌న్య సాయి ప‌ల్ల‌వితో డ్యాన్స్ చేసేందుకు క‌ష్ట‌ప‌డ్డాడ‌ని అనిపించింద‌ని చెప్పాడు. వ‌రుణ్ తేజ్ తో న‌టించిన ఫిదా సినిమా చూసిన‌ప్పుడు మొద‌ట‌గా తాను సాయిప‌ల్ల‌విని చూసాన‌ని మెగాస్టార్ అన్నారు. అప్పుడు ఎంతో నచ్చింద‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news