తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలోని హుజుర్ నగర్ మండలం బూరుగడ్డలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య కు పాల్పడింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. గురువారం మౌనిక అనే యువతి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది.
అయితే.. ప్రియురాలు మౌనిక మరణం తట్టుకోలేక మనస్థాపానికి గురయ్యాడు ప్రియుడు పవన్. ఈ నేపథ్యంలోనే ప్రియుడు పవన్… పురుగుల మందు సేవించి.. శుక్రవారం రోజున ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే ఈ ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే…ప్రియుడు పవన్.. పురుగుల మందు సేవిస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. ప్రస్తుతం ప్రియుడు పవన్ తీసిన సెల్పీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే… ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.