కరోనా వచ్చాక పాఠశాలల జాడ లేకుండా పోయింది. విద్యార్థులు స్కూలుకి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. అంతా ఆన్ లైన్లోనే జరుగుతున్నందున ఇయర్ ఫోన్ల ( Earphones ) వాడకం విపరీతంగా పెరిగింది. గతంలో కేవలం యువత మాత్రమే ఇయర్ ఫోన్స్ వాడేవారు. కానీ, ఇప్పుడు చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. ఐతే ఈ ఇయర్ ఫోన్ల వాడకం మంచిది కాదు. ఎక్కువ సేపు వాడుతున్నట్లయితే వినికిడి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
ఇయర్ ఫోన్ల వల్ల వచ్చే నష్టాలు
ఇయర్ ఫోన్లని చెవిలో పెట్టుకోవడం వల్ల చెవి చర్మానికి రాపిడి జరిపి దురదకి కారణం అవుతుంది. ఆ దురద కారణంగా బాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఎక్కువ సౌడుతో ఎక్కువ సమయం ఇయర్ ఫోన్స్ లో వింటుంటే వినికిడి శక్తి తగ్గిపోతుంది.
మరి దీన్ని అరికట్టడానికి ఏం చేయాలి?
ఇయర్ ఫోన్లతో పాటలు వినడం, మీటింగులకి అటెండ్ కావడం, ఫోన్ మాట్లాడడం తగ్గించాలి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. వర్క్ అంతా ఇంటి నుండే జరుగుతుంది కాబట్టి, కాల్స్ మాట్లాడడం కంపల్సరీ అయిపోయింది. అందువల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ కన్నా హెడ్ ఫోన్ వాడడం మంచిది. దానివల్ల చెవికి రాపిడి జరగడం ఉండదు. ఇంకా, ఇయర్ ఫోన్స్ వాడేటపుడు దానికి ఉన్న రబ్బరు బ్యాండ్లని తీసి ఆల్కహాల్ తో కడిగి పొడిబారిన తర్వాత వాడాలి. అలాగే, ఎక్కువ సమయం వాడకుండా మధ్యలో బ్రేక్ ఇవ్వాలి. పూర్తి శబ్దంతో కాకుండా 60శాతం కంటే తక్కువ వాల్యూమ్ లోనే వినాలి. ఇంకా, ఒకేసారి హై వాల్యూమ్ కి వెళ్ళకూడదు.