వింత: శునకం కోసం ఇతను ఏం చేసాడంటే…?

-

అనారోగ్యం తో సతమతం అవుతున్న ఒక శునకాన్ని ఓ యువకుడు చేరతీసాడు. నిజంగా అతను ఆ కుక్కని చూసుకుంటున్న విధానం చాల వింతగా ఉంది. ఆ శునకం ఏ మనిషిని తన దగ్గరకి రానివ్వడం లేదు. అందుకే ఒక వినూత్న పద్ధతిని కనుగొన్నాడు. ఈ వింత విషయాన్నీ చూశారంటే మీరూ ఆశ్చర్య పోవాల్సిందే..! ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… లక్నోలోని గోమతి నగర్‌కు చెందిన మిలింద్‌రాజ్ లాక్ డౌన్ లో తీవ్ర అనారోగ్యం తో బాధ పడుతున్న ఒక శునకాన్ని ఇంటికి తీసుకెళ్లి చేరదీశాడు.

కానీ అది ఎవర్నీ తన వద్దకి రానివ్వడం లేదు. ఆ శునకానికి కళ్లు సరిగా కనిపించక పోవడం తో పాటు చెవులు కూడా వినిపించవు. ఎవరో దానిని బాగా కొట్టారని… అది అందుకే గాయపడింది తెలుసుకున్నాడు. దీనితో తాను ఆ శునకాన్ని వైద్యునికి చూపించాడు. డ్రోన్ మ్యాన్’గా గుర్తింపు పొందిన మిలింద్‌రాజ్ కి డాక్టర్ మనుషులకి దూరంగా ఉండాలనుకుంటోందని తెలిపారు.

అప్పుడు మిలింద్‌రాజ్ కి ఒక వింత ఆలోచన వచ్చింది. ఇలా ఆ శునకాన్ని సంరక్షించేందుకు ఒక రోబోను తయారు చేశాడు. సమయానికి శునకానికి ఆ రోబో ఆహారం అందిస్తుంది. అలానే ఆ రోబో నిరంతరం ఆ శునకాన్ని కనిపెట్టుకుని ఉంటుంది. పైగా రోబోను శునకం కూడా ఇష్టపడుతోంది. ఇలా అతను చేసిన ఈ ఆర్టిఫిషల్ రోబో ఎంతో బాగా ఆ శునకాన్ని చోసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news