.ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

-

ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఆదివారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా.. అందులో దళ కమాండర్ బద్రు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని తలపై రూ.20లక్షల రివార్డు సైతం ఉన్నది. ఈ క్రమంలోనే సోమవారం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలైంది.

రాష్ట్రంలో జరిగిన ఘటనపై పౌరహక్కుల సంఘం సీరియస్ అవ్వడమే కాకుండా లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసింది. మావోయిస్టుల భోజనంలో విషప్రయోజం జరిగిందని దీనిపై విచారణ జరపాలంటూ పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాకుండా, మృతదేహాలకు వైద్య నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని, ఆ టైంలో వీడియో రికార్డు చేయాలని పిటిషనర్ కోరారు.దీనిపై సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరగనుంది. కాగా, దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది

Read more RELATED
Recommended to you

Latest news