Ram Gopal Varma: టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు హై కోర్టులో ఊరట లభించింది. రామ్ గోపాల్ వర్మ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హై కోర్టు. తొందర పాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.
సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు,ఫోటో మార్ఫింగ్ పోస్టులు చేశారంటూ వర్మ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. వర్మపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల పరిధిలో పలు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఇదే కేసులో హై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇక రామ్ గోపాల్ వర్మ క్వాష్ పిటిషన్ వచ్చే బుధవారానికి వాయిదా పడింది. ఆ లోపు వివరాలు సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది కోర్టు. తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని వర్మ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. తొందర పాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.