‘రంగమార్తాండ’ నుంచి లిరికల్‌ సాంగ్‌

-

టాలీవుడ్‌ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంపౌండ్‌ నుంచి వస్తున్న ప్రాజెక్ట్‌ రంగమార్తాండ. మరాఠీలో సూపర్ హిట్‌గా నిలిచిన నట సామ్రాట్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ప్రకాశ్ రాజ్.. రమ్యకృష్ణ.. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించిన ‘రంగమార్తాండ’ విడుదలకు ముస్తాబవుతోంది. కాలెపు మధు – వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రాహుల్ సిప్లి గంజ్ – శివాత్మిక కూడా జంటగా నటించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం లిరికల్ సాంగును రిలీజ్ చేశారు.

 

‘పొదల పొదల గట్ల నడుమ లగోరంగ లగోరే … పొడుస్తుంటే చందమామ లగోరంగ లగోరే’ అంటూ ఈ పాట సాగుతోంది. ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు. రాహుల్ సిప్లి గంజ్ ఈ పాటను ఆలపించాడు. నేను అనే అహంభావాన్ని … నాది అనే స్వార్థాన్ని విడిచిపెట్టి చూడు, జీవితం చాలా అందంగా కనిపిస్తుంది” అనే అర్థంలో ఈ పాట సాగుతోంది.

టైటిల్ ను బట్టే ఇది ఒక నాటకరంగానికి చెందిన వ్యక్తి చుట్టూ తిరిగే కథ అనే విషయం అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన సీతారామశాస్త్రి పాట సాహిత్యం పరంగా పాప్యులర్ అయింది. చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version