MAA Elections 2021: ఆ ఫ్యామిలీ.. నరేశ్‌ తవ్విన గుంతలో పడిపోయింది.. జీవిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

-

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్ (మా) ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతుంది. మా అధ్యక్ష పీఠం కోసం కోసం హీరో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ ఇద్దరు తమ ప్యానల్స్‌తో ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల ప్ర‌చార జోరును చూస్తే సాధార‌ణ ఎన్నిక‌ల్లాగా త‌లిపిస్తున్నాయి. ఇక అక్టోబర్ 10న జ‌రుగ‌నున్న పోలింగ్ కి అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవిత మంచు ఫ్యామిలీ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నరేష్ తవ్విన గుంతలో మోహన్ బాబు ఫ్యామీలీ పడిందని, ఆ ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తోందని ఆమె కామెంట్ చేశారు. జీవిత చేసిన సెన్సెష‌న‌ల్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎవరైనా.. ఎవరికైనా.. మద్దతు ఇవ్వొచ్చు. ప్ర‌తి ఒక్క‌రూ ధర్మంగా, న్యాయంగా పోరాడాలని అన్నారు.

కానీ, `మా` విషయంలో నరేశ్ స్వార్థంగా ప‌నిచేస్తున్నారనీ, అది స‌రైన‌ది కాద‌ని తెలిపారు. అస‌లు ప్ర‌కాశ్ రాజ్ అధ్యక్షుడు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. ఆయ‌న నిజాయతీగా పని చేస్తారన్నారు. ఇక్కడ బెదిరింపులు, ప్రలోభాలు ఎందుకని సూచించారు జీవిత. తాను సరదాగా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, సేవ చేసేందుకు మాత్రమే తాను పోటీకి దిగుతున్నానని స్ప‌ష్టం చేసింది జీవిత. ఎవ్వ‌రి ప్ర‌లోభాల‌కు లొంగి ఓట్లు వేయొద్దని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version