MAA ELECTIONS : విష్ణుకు ఓటేసెందుకు ముంబై నుండి వచ్చిన హాట్ హీరోయిన్..!

-

గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు రసవత్తరంగా సాగిపోతున్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద సాధారణ ఎన్నికలను తలపించేలా రిగ్గింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం నుండి దాడులు చేసుకునే వరకు మా సభ్యులు వెళ్ళిపోయాయి. తాజాగా శివ బాలాజీ ని నటి హేమ కొరకడం కనిపిస్తుంది. దాంతో శివబాలాజీ చేతికి గాయం అయింది. హేమ ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ చేస్తుండగా… శివబాలాజీ మంచు విష్ణు కు సపోర్ట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ ఎన్నికల్లో మొత్తం 900 సభ్యులు ఉండగా ఇప్పటి వరకు ఐదు వందలు ఓట్లు పోలింగ్ అయినట్టు తెలుస్తోంది.

ఇక కేవలం హైదరాబాద్ లో ఉన్న నటీనటులు మాత్రమే ఓటు వేయడం కాకుండా ముంబై ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఓటు వేయడం ఈసారి ఎన్నికల్లోనే కనిపిస్తుంది. తాజాగా మంచు విష్ణుకు ఓటు వేసేందుకు ముంబై నుండి జెనీలియా వచ్చింది. ఈ సందర్భంగా మంచు విష్ణు తన కోసం ఫ్రెండ్ వచ్చింది అని ఇలియానా ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లడం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి టికెట్లు బుక్ చేసి ఎన్నికల్లో ఓటు వేయడానికి రప్పించారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version