ప్రకాష్ రాజ్, నరేష్ ల మధ్య వాగ్వాదం

-

జనరల్ అసెంబ్లీ ఎన్నికలకు తీసి పోకుండా ’మా‘ ఎన్నికలు జరుగున్నాయి. బయటకు అంతా ప్రశాంతంగా జరుగుతున్నాయి అని సినీ పెద్దలు చెబుతున్నప్పటికీ.. లోపల మాత్రం కురుక్షేత్రం జరగుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రం లోపల ప్రకాష్ రాజ్ ప్యానెల్, విష్ణు ప్యానెళ్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక దశలో రెండు వర్గాలవారు బాహాబాహీకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈఘటనలతో పాటు మరోవైపు రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరుపును మా సభ్యుడు కానీ వ్యక్తి రిగ్గింగ్ కు పాల్పడ్డాడని విష్ణు ప్యానెల్ ఆరోపిస్తుంది. తాజాగా ఈ విషయమై నరేష్, ప్రకాష్ రాజ్ ఇరువురు ముఖాముఖిగా తలపడ్డారు. ఇద్దరు బహిరంగంగా వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. రిగ్గింగ్ జరిగిందని నరేష్ ఆరోపించగా.. అదంతా అసత్య ప్రచారం అంటూ ప్రకాష్ రాజ్ గట్టిగా వాదించారు. ప్రచారం ఊపందుకున్నప్పటి నుంచి ప్రకాష్ రాజ్, నరేష్ ల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఇరువురు తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version