MAA ELECTIONS : అందుకే శివబాలాజీ ని కొరికా అంటున్న హేమ..!

-

గత కొంతకాలంగా మా ఎన్నికల వేడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు మా ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం ఎనిమిది గంటల నుండి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరగనున్నాయి. అంతేకాకుండా రాత్రి 8 గంటల లోపు ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ కేంద్రం వద్ద రాజకీయ ఎన్నికల ను తలపించేలా వాతావరణం కనిపిస్తోంది. సభ్యులు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడమే కాకుండా దాడులకు దిగడం చూస్తూనే ఉన్నాం.

తాజాగా ప్రకాష్ ప్యానల్ కు చెందిన నటి హేమ మంచు విష్ణు ప్యానల్ కు చెందిన శివ బాలాజీని మోచేతి వద్ద కొరకడం కెమెరాల్లో రికార్డ్ అయింది.ఈ విషయాన్ని నరేష్ మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. హేమ శివ బాలాజీ చేతిని కోరిందని అన్నారు. తాజాగా దీనిపై హేమ కూడా స్పందించింది. ఏం చేయకుండా ఊరికే కొరుకుతానా అని ప్రశ్నించింది. లోపల చాలా గొడవ జరిగిందని తెలిపింది. ఆయన ఏం చేయకుండానే కొరికానా అని…ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడతాను అంటూ హేమ సమాధానం ఇచ్చింది. హేమ ఇచ్చిన సమాధానంతో లోపల పెద్ద గొడవ జరిగినట్లు అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version