మాచర్ల మంటలు..వైసీపీ-టీడీపీ దారుణ రాజకీయం.!

-

ఎక్కడైనా రాజకీయాల్లో అధికార పార్టీదే పైచేయి ఉంటుంది…అలాగే పోలీసులు కూడా అధికార పక్షం వైపు ఉంటారు…ఎక్కడైనా ఇదే జరిగే పని..ఇందులో దాచుకోవడానికి ఏమి లేదు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇక ఏపీలో రాజకీయాల్లో కూడా అదే పరిస్తితి ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కక్షపూరిత రాజకీయం బాగా జరుగుతుంది..ఈ విషయం అందరికీ తెలుసు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎదురుకున్న అవమానాలకు వైసీపీ అంతకంత రెట్టింపుతో తిరిగిచ్చేస్తుంది. దీంతో టీడీపీ వాళ్ళకు చుక్కలు కనబడుతున్నాయి. ఇందులో పోలీసుల పాత్ర ఏంటో చెప్పాల్సిన పని లేదు.

ఇక వైసీపీకి ధీటుగా టీడీపీ పోరాడటానికి ప్రయత్నిస్తుంది..కానీ వైసీపీ అధికార బలం ముందు తేలిపోతుంది. ఎక్కడక్కడ టీడీపీ నేతలు కేసులు ఎదుర్కోవడం, అరెస్ట్ అవ్వడం జరుగుతున్నాయి. అలాగే పెద్ద పెద్ద దాడులు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. తాజాగా మాచర్లలో కూడా జరిగింది. మొదట నుంచి మాచర్ల చాలా సున్నిత ప్రాంతం. ఇక్కడ వైసీపీ వాళ్ళు..టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కనీసం నామినేషన్లు వేసే పరిస్తితి లేదు. ఈ క్రమంలో అక్కడకు వెళ్ళిన బుద్దా వెంకన్న, బోండా ఉమాల పరిస్తితి ఏమైందో చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత టీడీపీ నేత హత్య..చంద్రబాబుకు అక్కడకు వెళ్ళడం. వరుసపెట్టి టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతూ వచ్చాయి. తాజాగా టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి..ఇదేం ఖర్మ కార్యక్రమం చేస్తున్నారు. మాచర్ల పట్టణంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా, అక్కడ కొందరు వైసీపీ శ్రేణులు…టీడీపీ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ వాళ్ళు..టీడీపీ వాళ్లపై రాళ్ళు రువ్వారు.

దీంతో టీడీపీ శ్రేణులు ప్రతిఘటించి..వైసీపీ వాళ్లపై దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులు టీడీపీ వాళ్ళని అడ్డుకున్నారు..జూలకంటిని అదుపులోకి  తీసుకున్నారు. ఆ తర్వాత వైసీపీ శ్రేణులు…టీడీపీ వాళ్లపై దాడులు చేశారు. టీడీపీ ఆఫీసు, వాహనాలు తగలబెట్టారు. ఆ తర్వాత పోలీసులు ఎంటర్ అయ్యి..పరిస్తితులని చక్కదిద్దారు. ఇక ఇదంతా వైసీపీ పని అని టీడీపీ వాళ్ళు..కాదు కాదు ఇది టీడీపీ కుట్ర అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలోనే గొడవలు జరిగాయని పోలీసులు అంటున్నారు. మొత్తానికి మాచర్లలో రాజకీయ మంటలు చెలరేగాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version