Madharaasi Official Trailer: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మదరాసి’. ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో పవర్ఫుల్ డైలాగ్స్, బిజిఎం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముందు లవ్, ఎంటర్టైన్మెంట్ తో సాగిన ట్రైలర్ అనంతరం యాక్షన్ మోడ్ లోకి సినిమా వెళ్ళిపోయింది.

ఇల్లీగల్ గన్స్ ను తమిళనాడులోకి రాకుండా ఎన్ఐఏ బృందం చేపట్టిన యాక్షన్ బ్యాక్ డ్రాప్ గా ‘మదరాసి’ సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. కాగా, శివ కార్తికేయన్ తెలుగులో కూడా అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. శివ కార్తికేయన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తన నటనకు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అవుతారు. ఈ సినిమా కోసం తన అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ట్రైలర్ చూసిన అనంతరం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.