తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందజేసింది టీటీడీ సంస్థ. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రిలీజ్ అయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ను సంప్రదించి టికెట్లను బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వెల్లడించారు. అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు అదే నెలకు సంబంధించిన గదుల బుకింగ్ ఓపెన్ కానుంది.

ఇదిలా ఉండగా…. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సెలవులు లేకపోవడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. నిన్న ఒక్కరోజు 72,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల రూపాయలు వచ్చింది. శ్రీవారి సర్వదర్శనానికి ఈరోజు ఆరు గంటల సమయం పట్టనుంది. మరోవైపు వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లడానికి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో కొన్ని ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.