సెబీ కొత్త చైర్ ప‌ర్స‌న్ గా మాధ‌బి పూరీ బుచ్

-

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ( సెబీ ) కి కొత్త బాస్ ను కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించింది. సెబీకి నూత‌న చైర్ ప‌ర్స‌న్ గా మాధ‌బి పూరీ బుచ్ ను కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించింది. సెబీ చ‌రిత్ర‌లోనే తొలి సారిగా ఒక మ‌హిళ‌ను చైర్ ప‌ర్స‌న్ గా నియ‌మించ ప‌డ్డారు. కాగ సెబీ కి ఇప్ప‌టి వ‌ర‌కు చైర్మెన్ గా ఉన్న అజ‌య్ త్యాగీ త‌న ప‌ద‌వీ కాలం నేటితో ముగయ‌నుంది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త చైర్ ప‌ర్స‌న్ ను నియ‌మించింది.

కాగ మాధ‌బి పూరీ బుచ్.. ఇప్ప‌టికే సెబీలో స‌భ్యురాలుగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన అనుభ‌వం ఉంది. మాధ‌బి పూరీ బుచ్.. చైర్ ప‌ర్స‌న్ నియ‌మించ‌డానికి కేంద్ర కేబినెట్ అపాయింట్స్ మెంట్స్ క‌మిటీ ఆమోదం తెలిపింది. దీంతో సెబీ చైర్ ప‌ర్స‌న్ బాధ్య‌త‌ల‌లో మాధ‌బి పూరీ బుచ్.. మూడు సంవ‌త్స‌రాలు పాటు ఉండ‌నుంది. కాగ మాధ‌వి పూరీ బుచ్ గ‌తంలో ఐసీఐసీఐ బ్యాంకు లోనూ ప‌లు కీల‌క బాధ్య‌త‌లును నిర్వ‌హించింది. ఐసీఐసీఐ లో మాధ‌వి పూరీ బుచ్ దాదాపు 20 ఏళ్ల పాటు ప‌ని చేశారు. ఐసీఐసీఐ లో సెక్యూరిటీస్ కు ఎండీగా, సీఈవో గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version