కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబిఐని ఉద్దేశించి… మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సి.బి.ఐ పంజరంలో బంధించబడిన చిలక అని… కేంద్ర ఎన్నికల కమిషన్ మరియు కాదు మాదిరి దీనికి కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలని సూచనలు చేసింది మద్రాస్ హైకోర్టు. తమిళనాడు లోని పోంజి కుంభకోణంపై సిబిఐ తో విచారణ జరిపించాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా… సి.బి.ఐ కి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని మద్రాస్ హై కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యం లోనే సిబిఐకి అధిక అధికారాలు మరియు అధికారంతో కూడిన చట్టబద్ధమైన హోదాను అందించే ప్రత్యేక చట్టాన్ని పరిగణలోకి తీసుకొని దానిని అమలు చేయాలని మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది మద్రాస్ హైకోర్టు. ప్రస్తుత వ్యవస్థ ను సరిదిద్దడానికి తాము చేసిన 12 పాయింట్లు సూచనలలో..”పంజరంలోని చిలకల ఉన్న దర్యాప్తు సంస్థ సిబిఐ” ని విడుదల చేసే ప్రయత్నం అని కోర్టు పేర్కొంది.