మోడ్రన్ డ్రెస్‌లో పాతికేళ్ల సుందరిలా మాధురి దీక్షిత్ ఫోజులు!

-

ఐదు పదుల వయసులోనూ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ నైనా..పాతికేళ్ల సుందరిలా ఆకట్టుకుంటోంది. ‘తేజాబ్’ మూవీతో బాలీవుడ్ లోకి అప్పట్లో ఎంట్రీ ఇచ్చిన నటి మాధురి..దాదాపుగా డెబ్బై కి పైగా చిత్రాల్లో నటించింది.

నటనతోనే మాత్రమే కాదు నాట్యంలోనూ తన సత్తా ఏంటో చాటుకుంది మాధురి. గ్రేస్ ఫుల్ స్టెప్స్ వేసి జనాలను తన వైపునకు తిప్పుకుంది మాధురి. బాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన దాదాపుగా నటి మాధురి హీరోయిన్ గా నటించింది. ‘డాన్స్ దివానే 3’ షో డాన్స్ షో లో కూడా ఈమె పార్టిసిపేట్ చేసింది. వయసు పెరిగే కొద్దీ..మాధురి అందం కూడా పెరిగిపోతుందన్నట్లు ఆమె తన గ్లామర్ మెయింటేన్ చేస్తోంది.

సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే మాధురి లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. మోడ్రన్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో కాలేజీ స్టూడెంట్ లాగా ఉన్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ అవుతున్నాయి. వాటిని చూసి నెటిజన్లు ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్, బ్యూటీ సీక్రెట్ రివీల్ చేయాలి’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మాధురి దీక్షిత్ సినిమాలు చేయడం లేదు. తన ఫ్యామిలీ తో చక్కగా టైం స్పెండ్ చేస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version