అయస్కాంత పర్వతం.. డ్రైవర్ లేకుండానే కొండపైకి వెళ్ల‌వ‌చ్చా..

-

సాధార‌ణంలో భూమి మీద ఎన్నో అద్భుతాలు చూస్తుంటాం. అందులో కొన్ని మానవ నిర్మాణం అయితే మ‌రికొన్ని ప్ర‌కృతి సిద్ధంగా ఏర్ప‌డిన‌వి. అలాంటి వాటిలోనే ఇది కూడా ఒక‌టి. అయస్కాంత పర్వతం ఇదొక వివరించ సాధ్యం కాని అద్భుతం. సాధారణంగా కొండపైకి ఎక్కాలంటే ఎంతో కష్టపడాలి. ఒకవేళ ఆ కొండ మీదకు రోడ్డు వేసి కారులో వెళ్లమన్నా కారు నెమ్మదిగా పైకి వెళుతుంది. ఎంతో ఇంధనం వృధా అవుతుంది. క‌శ్మీర్‌ లోని లడక్‌ ప్రాంతంలో లేహ్ సమీపంలో ఉన్న ఈ కొండ మాత్రం మిగిలిన కొండ‌త‌కు భిన్నంగా ఉంటుంది.

తన దగ్గరకు వచ్చే వారిని ఎంతో ఆప్యాయంగా పలుకరించి, తనే స్వయంగా తీసుకువెళ్లిపోతుంది. అంటే, ఈ కొండ మీదకు కారులో వెళ్లాలనుకునేవారు హాయిగా ఇంజన్‌ను ఆఫ్‌ చేసి స్టీరింగ్‌ పట్టుకుని కూర్చుంటే చాలు. ఇనుపముక్కను అయస్కాంతం ఆకర్షించినట్లు కారును పైకి లాక్కుంటుంది. లేహ్-కార్గిల్ హైవేపై లేహ్ నగరం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న రహదారి. ఇది స్థిరమైన వాహనాలను పైకి లాగే అయస్కాంత కొండ.


లడఖ్‌లోని మాగ్నెటిక్ హిల్‌గా ప్రసిద్ది చెంది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ‌గా నిలిచింది. సహజసిద్ధంగా ఏర్పడిన అయస్కాంత తత్వమున్న ఈ కొండపైకి వెళ్లేవారు దీనిలోని అయస్కాంత శక్తికి అబ్బురపోతారు. కేవలం ఈ విషయాన్ని చూడటానికి మాత్రమే చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది కారులో ఇక్కడికి వస్తుంటారు. లే-కార్గిల్ రహదారిపై జరిగిన వింత సంఘటనను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల‌కు మంచి అనుభావాన్ని అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news