వ్యాక్సిన్ తీసుకుంటేనే రైలు ప్రయాణం.. వివరాలివే

-

మహారాష్టలో ముంబై నగరంలో లోకల్ ట్రైన్లు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఎన్నో రోజులుగా ఆగిపోయిన రైళ్ళు పట్టాల మీదకి రానున్నాయి. ఐతే ఈ రైళ్ళలో ప్రయాణం చేయాలనుకునేవారు కొన్ని నియమాలని పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి కావాలి. అది కూడా రెండవ డోసు వేసుకుని 15రోజులు పూర్తి అయితేనే రైళ్ళలో ప్రయాణం చేయవచ్చు. అదీగాక కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. మాస్క్, శానిటైజర్, వ్యక్తిగత శుభ్రత, స్టేషన్లో పాటించాల్సిన నియమాలని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడి చేసింది.

ఈ నెల 12వ తేదీ నుండి ఈ విధానం అమలులోకి రానుంది. దీనికోసం ప్రత్యేక రైలు పాస్ తయారు చేస్తున్నారు. ఇంకా, ఒక ప్రత్యేకమైన యాప్ ని రూపొందించనున్నారు. లోకల్ రైళ్ళలో ప్రయాణం చేసే వ్యక్తులు, తమ వ్యాక్సినేషన్ వివరాలను ఆ యాప్ లో పొందుపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాతే లోకల్ రైళ్ళలో ప్రయాణం చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version