మహారాష్ట్ర మాజీ హోం మంత్రి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

-

అధికారం అడ్డుపెట్టుకుని పలు చీకటి దందాలు చేసి అరెస్టయిన మహారాష్ట్ర తాజా మాజీ హోం మంత్రి అనిల్ దేశముఖ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను మహారాష్ట్ర స్పెషల్ కోర్ట్ తిరస్కరించింది.

2021 , నవంబర్ 2 వ తేదీన సుమారు 100 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన దేశముఖ్ ను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టారు. దాదాపు 60 రోజుల నుంచి జైల్లోనే గడుపుతున్న దేశముఖ్ తరుపున ఆయన న్యాయవాది మహారాష్ట్ర స్పెషల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈరోజు విచారణ చేపట్టారు.
కోర్టులో ఈడీ తరుపున న్యాయవాది హాజరయ్యి నిందితుడు బెయిల్ మీద విడుదలైన వెంటనే సాక్ష్యాలను తారు మారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ పిటిషన్ రద్దు చేయవల్సిందగా కోర్టును కోరడంతో వీరి వాదనతో ఏకభవించిన ధర్మాసనం దేశముఖ్ బెయిల్ పిటిషన్ రద్దు చేసింది

Read more RELATED
Recommended to you

Latest news