కరోనా వైరస్ ‘సూపర్ స్ప్రెడర్’లను గుర్తించడానికి గానూ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో మంగళవారం నుండి దుకాణదారులు, కూరగాయల విక్రేతలు, పాల అమ్మకందారులు మరియు పెట్రోల్ పంప్ ఉద్యోగులకు వేగవంతమైన యాంటిజెన్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటన చేసింది. జిల్లాలోని కేజ్, అంబెజోగై, మజల్‌గావ్, అష్తి, పార్లి పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించాలని బీడ్ కలెక్టర్ రాహుల్ రేఖవర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దుకాణదారులు, కూరగాయలు మరియు పండ్ల విక్రేతలు, పాల అమ్మకందారులు మరియు బ్యాంక్ మరియు పెట్రోల్ పంప్ ఉద్యోగులపై మంగళవారం నుండి మూడు రోజుల పాటు వేగంగా యాంటిజెన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు కరోనా పరిక్షల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.