మన దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. అక్కడి పరిస్థితులు రోజు రోజుకి ఆందోళనకరంగా మారాయి. అక్కడ ఇప్పటి వరకు దాదాపు 1300 కేసులు నమోదు కాగా రెండు రోజుల్లో మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ కేసులు ఇంకా పెరిగితే ఎం చెయ్యాలి అనేది అక్కడి ప్రభుత్వానికి అర్ధం కాని పరిస్థితి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి తీవ్రంగా కేంద్రం సహకారం తో ప్రయత్నాలు చేస్తుంది మహారాష్ట్ర. అవసరం అయితే కరోనా కట్టడికి కేంద్ర బలగాలను దింపే ఆలోచన కూడా చేస్తుంది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక అక్కడ ఒక్క రోజే 25 మంది వరకు మరణించారు.
దీనితో కేంద్రం కూడా ఆ రాష్ట్ర పరిస్థితిపై కాస్త కంగారు గానే ఉంది. అక్కడికి క్యూబా వైద్యులను దింపాలి అనే ఆలోచనలో కూడా కేంద్రం ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. త్వరలోనే అక్కడికి క్యూబా వైద్యులతో పాటుగా ప్రముఖ విదేశీ వైద్యులను కూడా పంపే ఆలోచనలో ఉన్నారు. అక్కడ ఈ స్థాయిలో కేసులు పెరగడం చూసి ప్రజల్లో భయం వ్యక్తమవుతుంది. రోజు రోజుకి ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది.