రిజర్వ్ బ్యాంకు కీలక వ్యాఖ్యలు… భయపడకండి…!

-

కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో ఆర్ధిక పరిస్థితి పై ఇప్పుడు తీవ్ర ఆందోళన నెలకొంది. దాదాపు నెల రోజుల నుంచి వ్యాపారాలు అనేవి నడవడం లేదు. ప్రజల్లో కరెన్సీ కూడా మారడం లేదు. దీనితో ఆర్ధిక వ్యవస్థ మరింత ఆందోళనకరం గా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రాణాలతో ఉన్నా సరే జనాలు నరకం చూస్తారని అంటున్నారు.

ఇక ఇది పక్కన పెదిథెఇప్పుదు ఈ పరిస్థితి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పందించింది. కరోనా వైరస్‌ వల్ల తలెత్తిన పరిస్థితులు మళ్లీ చక్కబడితే మళ్లీ దేశీయ గిరాకీ, వృద్ధి పుంజుకుంటాయని ఆర్‌బీఐ ధీమా వ్యక్తం చేసింది. ఇటీవల ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, ఉద్దీపన చర్యలు ఇందుకు దన్నుగా నిలుస్తాయన్న రిజర్వ్ బ్యాంకు… ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వృద్ధిరేటును అంచనా వేయడం కష్టతరమని వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ వృద్ధిపై కరోనా ప్రభావం అధికంగా ఉందని, ఇది మనకూ వర్తిస్తుందని అభిప్రాయపడింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు వేసిన అంచనాల్లో 2020-21లో వృద్ధి గాడిలో పడొచ్చని రిజర్వ్ బ్యాంకు అంచనా వేసింది. 2019-20లో రబీ సీజన్‌ కలిసిరావడం, అధిక ఆహార ధరలు గ్రామీణ గిరాకీ పెంచాయని, కీలక రేట్ల కోత వల్ల బ్యాంక్‌ రుణ రేట్లు తగ్గాయని రిజర్వ్ బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది. కరోనా వ్యాప్తితో అంచనాలు తలకిందులు అవుతున్నాయని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version