మహేశ్‌ దుబాయ్‌ టూర్ లో అసలు విషయం అదేనా

-

ఒక దెబ్బకు రెండు పిట్టలన్న మాట విన్నామేగానీ. చూడలేదు. మహేశ్‌ బాబును చూస్తే.. ఈ సామెతకు అర్థం ఏమిటో తెలుస్తుంది. ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ ట్రిప్‌ బయలుదేరిన మహేశ్‌.. ఒక్క ఎంజాయ్‌మెంట్‌ కోసమే కాదు.. మరో ముఖ్యమైన పనికోసం అక్కడికి వెళ్లాడు. ఇంతకీ దుబాయ్‌లో మహేశ్‌కు వున్న రెండో పని పై ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

దుబాయ్‌ వెళ్లడానికి ముందు… మహేశ్‌ చేసిన కసరత్తు ఇది. ఏడాదిపాటు కరోనా హాలిడేస్‌తో గడిపేసిన మహేశ్‌ సర్కారువారి పాట కోసం లాంగ్‌ హెయిర్‌తో కనిపించనున్నాడు. మరోవైపు.. ఫిట్‌నెస్‌ కోసం ఇలా కసరత్తులు చేస్తున్నాడు. షూటింగ్‌కు రెడీ అవుతున్నానంటూ.. బాక్స్‌ జంప్‌ పోస్ట్‌తో హింట్‌ ఇచ్చాడు మహేశ్‌.

అదిగో ఇదిగో అంటూ సర్కారువారి పాట షూటింగ్‌ను ఊరిస్తూ వచ్చాడు దర్శకుడు పరశురామ్‌. అమెరికా బ్యాక్డ్రాప్‌ కథ కావడంతో.. ముందుగా అక్కడి పార్ట్‌ పూర్తిచేసి.. ఆతర్వాత హైదరాబాద్‌ షెడ్యూల్ ప్లాన్‌ చేశారు. కరోనా, వీసా ఇబ్బందులతో షూట్‌ ఎప్పటికప్పుడు పోస్ట్‌ పోన్‌ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 26న దుబాయ్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నారు.

షూటింగ్‌కు ఐదు రోజుల ముందే.. మహేశ్‌ ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ల్యాండ్‌ అయ్యాడు. ఒకవైపు హాలిడే ట్రిప్.. మరోవైపు షూటింగ్‌ కలిసొచ్చేలా ప్లాన్‌ చేశాడు. 26 నుంచి 20 రోజులపాటు అక్కడే కొన్ని సీన్స్‌ .. ఓ పాటను చిత్రీకరిస్తారు. మొత్తానికి ఏడాది తర్వాత అందరికంటే లేటుగా మహేశ్‌ కెమెరా ముందుకొస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version