క్రేజీ న్యూస్‌.. మరో బిజినెస్‌లోకి సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఎంట్రీ..

-

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రో వైపు వ్యాపారం రంగంలో రాణిస్తున్నారు. ఇప్ప‌టికే పెద్ద పెద్ద స్టార్లు ప‌లు రకాల బిజినెస్‌లు చేస్తూ స‌క్సెస్ ఫుల్ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. అందులో మ‌హేష్‌బాబు మొద‌టి స్థానంలో ఉంటాడు. న‌టుడిగా, నిర్మాత‌గా, వ్యాపార వేత్త‌గా రెండు చేతుల్లో సంపాదిస్తున్నాడు మ‌హేష్‌బాబు. ఇప్ప‌టికే మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట‌రైన విష‌యం తెలిసిందే.

 

ఈయ‌న పేరుమీదున్న ఏఎంబీ సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మ‌ల్టీప్లెక్స్‌ల‌లో ఒక‌టి. ఇక మ‌హేష్ కేవ‌లం థియేట‌ర్ బిజినెస్ మాత్ర‌మే కాకుండా క్లాతింగ్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. ఆయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త ఈ బిజినెస్‌ల‌ను చూసుకుంటుంది. ఇదిలా ఉంటే మ‌హేష్‌బాబు తాజాగా మ‌రో బిజినెస్‌లోకి ఎంట‌రవుతున్నాడు. మ‌హేష్‌బాబు తాజాగా రెస్టారెంట్ బిజినెస్‌లోకి ఎంట‌ర‌య్యాడు. మిన‌ర్వ గ్రూప్‌తో క‌లిసి బంజారాహిల్స్‌లో రెస్టారెంట్ బిజినెస్‌ను స్టార్ట్ చేస్తున్నాడు మ‌హేష్‌బాబు. ఇప్ప‌టికే రెస్టారెంట్ ప్లాన్‌ను కూడా సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ బిజినెస్‌పై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version