అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన మహేష్ బాబు

-

సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 40 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా 20 సంవత్సరాల కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఇటీవల ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. అయితే జక్కన్న సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియదు దీంతో నిరాశకు గురి అవుతున్నా అభిమానులకి సోషల్ మీడియా వేదికగా రోజుకో ఒక ఫోటో షేర్ చేస్తూ ఉన్నారు మహేష్ బాబు .

గత 3 రోజుల నుంచి రోజుకో ఫోటో షేర్ చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. నిన్నటికి నిన్న ఆయన బ్లాక్ సూట్, గాగుల్స్ తో కనిపించాడు. ఇక నేడు అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. చెక్స్ షర్ట్.. చెదిరిన జుట్టుతో ఎంతో అందంగా కనిపించాడు. నిజం చెప్పాలంటే హాలీవుడ్ హీరోలు ఏ మాత్రం పనికిరారు అనేట్టుగా మహేష్ బాబు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version