షూటింగ్ లో సూపర్‌స్టార్ మ‌హేశ్ బాబు..!

-

సుదీర్ఘ కాలం ఇంటికే ప‌రిమిత‌మైన సూపర్‌స్టార్ మ‌హేశ్ బాబు తిరిగి షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు. అయితే అది  సినిమా షూటింగ్ మాత్రం కాదు.. కేవలం కమర్షియల్ యాడ్ మాత్రమే. దాని కోసం మళ్లీ మొహానికి మేకప్ వేసుకున్నాడు మహేష్. పూర్తిగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ షూటింగ్ మొదలుపెట్టారు. మ‌హేశ్ అక్క‌డకు వచ్చిన ఫొటోను శ్రేయాస్ గ్రూప్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇకపోతే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను మహేష్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో మహేష్ కు జంటగా మహానటి ఫెమ్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లోనే మొదలు కానుంది. అది కూడా అప్పటికి వైరస్ నియంత్రణలోకి వస్తేనే.

Read more RELATED
Recommended to you

Exit mobile version