మహేష్ తో మహానటి…!

-

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు చేసే సినిమాపై ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ లో మహేష్ కి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలిసిందే. మహేష్ బాబు తో సినిమా చేయడానికి టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడపల్లి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే మహేష్ కి కథ నచ్చలేదు.

దీనితో అతను వెనక్కు తగ్గాడు. ఆ తర్వాత గీత గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. హేష్ తన 27వ సినిమాను చేయనున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ ని ఎంపిక చేసారు. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు కూడా పూర్తి అయినట్టు సమాచారం. కీర్తి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కీర్తి ప్రస్తుతం తెలుగులో ‘మిస్ ఇండియా, రంగ్ దే’ సినిమాల్లో ఆమె నటిస్తుంది. ఈ సినిమా కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మొదలు కానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా ముందా పరుశురాం సినిమా ముందా అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version