ఎమ్మెల్యే లని పరుగులు పెట్టిస్తున్న కరోనా .. !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ కరోనా కట్టడి చేయడం విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తూ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛను అప్పగించారు. నిత్యావసర సరుకుల విషయంలో కూరగాయల విషయంలో ఇప్పటికే అనేక నిర్ణయాలు వైయస్ జగన్ సర్కార్ తీసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ హోంక్వారంటైన్ పరిశుభ్రత చర్యలు వంటివి విషయాలలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని వైయస్ జగన్ సర్కార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నిత్యావసర సరుకులు విషయంలో కూరగాయలు విషయంలో దుకాణదారులు ప్రభుత్వం నియమించిన ధరల కంటే ఎక్కువగా అమ్మితే జైలుకు పంపించాలని కూడా తాజాగా ఆదేశాలు ఇచ్చారు. తాజాగా కరోనా కట్టడి విషయంలో అధికారులతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

జరిగిన ఈ సమావేశంలో గతం లోనే రోడ్డుమీద నిరాశ్రయులైన వారికి కళ్యాణ మండపాలు లేకపోతే కాలేజీలను అద్దెకు తీసుకుని వాళ్లకి మూడుపూటలా కడుపునిండా ఆహారం పెట్టాలని బెడ్ షీట్, బ్రష్ మరియు సోప్ అంతా కూడా క్వాలిటీ తరహాలో ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడ, ఎక్కడ ఎంత మంది నిరాశ్రయులయ్యారు వారి లెక్క కలెక్టర్ల దగ్గర అడిగి తెలుసుకున్నారట వైయస్ జగన్.

ఈ సందర్బంగా రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా నేను అన్నం తినలేదు అన్నమాట నాకు వినపడకూడదు అని అధికారులకు సూచించారు అంట. వీలైతే జగనన్న గోరుముద్ద మెనూ కూడా…ఫాలో అవుతూ ఇలా నిరాశ్రయులైన వారికి క్వాలిటీతో ఆహారం అందించాలని జగన్ సూచించారట. ఇటువంటి తరుణంలో అసలైన ఈ కీలక టైం లో ఏపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అందుబాటులో లేనట్లు వార్తలు ఇటీవల గట్టిగా రావడంతో..ఎమ్మెల్యేలను పరుగు పెట్టించడానికి వైయస్ జగన్ రెడీ అయ్యారట.

 

చాలా నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు లాక్ డౌన్ అవటంతో హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాలకు వెళ్లిపోవడం జరిగింది. దీంతో వైయస్ జగన్ రేపటిలోగా నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే లేకపోయినా విషయం వేరే లాగా ఉంటుందని గట్టిగా వైసిపి పార్టీ నేతలకు సూచించారు అట. ఎక్కడ ఏ నియోజకవర్గం లో ఎటువంటి సమస్య ఎదురైనా మొదటిగా సదరు నియోజకవర్గం ఎమ్మెల్యేని బాధ్యుడిని చేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. దీంతో బెంగుళూరు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు..తిరిగి ఏపీ రావడానికి పరుగులు పెడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version