సైరా లాంటి చారిత్రక నేపథ్యమున్న చిత్రంలో నటించిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తదుపరి ఓ సామాజిక దృక్ఫథమున్న కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు ఎదురున్నది లేని డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఈ కథను మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా మలిచాడని తెలుస్తోంది. దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ మూవీలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించబోతున్నారట. నక్సలైట్ పాత్రలో మహేష్ కెమెరా అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు చెర్రీ కూడా ఇందులో నక్సలైట్‌గా కనిపిస్తుండగా.. అతడితో పాటు మహేష్ పాత్ర కాసేపు ఉండబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇటీవల కొరటాల శివ, మహేష్‌ను కలిసి పాత్ర గురించి చెప్పినట్లు టాక్. ఇక కొరటాలతో ఉన్న సాన్నిహిత్యం పాటు అటు మెగాస్టార్ ఫ్యామిలితో సత్సంబంధాల వల్ల ఆ పాత్రలో నటించేందుకు మహేష్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే నిజమైతే.. ఈ సినిమాకు సూపర్‌స్టార్ మరో అదనపు ఆకర్షణ అవుతాడు. కాగా, ఈ సినిమాను మేట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.