“జవాన్” సినిమాపై మహేష్ బాబు ప్రసంశలు … డైరెక్టర్ ను పోగిడేస్తూ ట్వీట్ !

-

షారుఖ్ ఖాన్ లేటెస్ట్ గా నటించగా రిలీజ్ అయిన చిత్రం “జవాన్”. ఈ సినిమాను ఎంతో ఛాలెంజ్ గా తీసుకుని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జవాన్ మూవీ ప్రేక్షకుల నుండి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. నిన్న ఒక్కరోజే 120 కోట్లకు పైగానే వసూళ్లు సాధించి ఇప్పటి వరకు తెలుగు సినిమాలు సాధించని కలెక్షన్ రికార్డును కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా గురించి తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవ్వాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కితాబిచ్చాడు. డైరెక్టర్ అట్లీ సినిమాలో ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ ను కవర్ చేసుకుంటూ మంచి యాక్షన్ సీన్ లతో అదరగొట్టాడు అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. ఇందులో షారుఖ్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్, చరిష్మా వేరే లెవెల్ లో ఉందని అభిప్రాయపడ్డాడు మహెష్ బాబు.

ఈ సినిమాతో తన రికార్డులను తానే బ్రేక్ చేస్తాడు అన్నారు మహేష్. ఇందులో నటించిన నటీనటులు అందరూ చాలా బాగా చేశారు అంటూ మెచ్చుకున్నారు మహేష్ బాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version