ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో… బీఆర్ ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి (BRS) పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల్లో NOTA ఆప్షన్ లేకపోవడంతో, పార్టీ ఓటింగ్‌లో పాల్గొనక కుండా ఉండాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్న తరుణంలో, బీఆర్‌ఎస్ వైఖరి పై ఆసక్తి నెలకొంది. కాగా బీఆర్‌ఎస్‌కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు.
ఇక అటు ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్‌లో మాక్ ఓటింగ్ ఉండనుంది. ఇండియా కూటమి పక్షాల ఎంపీలు కూడా పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం ఎన్డీయే కూటమి పక్షాల ఎంపీల మాక్ ఓటింగ్ ఉంటుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు కూడా ఓటర్లు ఉంటారు. మొత్తం సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటే.. 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు ఖాయం.