మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబో మూవీకి టైటిల్ ఫిక్స్..!

-

తాజాగా మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎమ్ బీ 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక మూవీ వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు పుష్కర కాలం తర్వాత వీరిద్దరి కాంబో మళ్లీ తెరపై కనిపించబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ వస్తున్నాయి.. కానీ టైటిల్ ఇంకా ప్రకటించలేదు. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజ హెగ్డే శ్రీ లీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. భూమి పడ్నేఖర్ కూడా స్పెషల్ రోల్ చేస్తోందని వార్తలు వినిపించినా.. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

ఈ చిత్రం ఏడాది ఆగస్టు 11వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఉగాది సందర్భంగా అంటే మార్చి 22న ఈ సినిమా టైటిల్ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. అయితే అభిమానులు మాత్రం అయోధ్యలో అర్జునుడు సినిమా టైటిల్ అయితే బాగుంటుంది అని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారట. ఈ క్రమంలోనే అభిమానుల కోరిక మేరకు దర్శకనిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన వెంటనే ఆయన రాజమౌళితో తన 29వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా అడ్వెంచర్ యాక్షన్ మూవీగా రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది అంటే అందుకు కారణం ఆర్ ఆర్ ఆర్ అని చెప్పాలి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో రాజమౌళి తన డైరెక్షన్లో ఎటువంటి సినిమాలు తీసుకురాబోతున్నాడు అనే ఆత్రుత ఇప్పుడు అందరిలో కలిగింది. మరి మహేష్ బాబు సినిమా ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version