ఇకపై ‘ఫోన్‌ పే’ స్మార్ట్‌ స్పీకర్లకు మహేష్‌ బాబు వాయిస్‌ !

-

డిజిటల్‌ చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో దాదాపు అన్ని దుకాణాల్లోనూ స్మార్ట్‌ స్పీకర్లు దర్శనం ఇస్తున్నాయి.క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో చేసే ప్రతి పేమెంట్‌ స్పీకర్‌ ద్వారా ట్రాన్సాక్షన్ అయిందో లేదో వినిపిస్తుంది. ఇకపై ‘ఫోన్‌ పే’ ద్వారా చేసే డిజిటల్ చెల్లింపులకు ప్రిన్స్ మహేష్‌బాబు వాయిస్‌ వినిపించనుంది.

యూజర్లను ఆకర్షించడానికి ‘ఫోన్‌ పే’ సరిక్రొత్త ప్రయత్నం చేసింది. గతేడాదిలో తన స్మార్ట్‌ స్పీకర్లకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్‌ని అందించిన కంపెనీ…. తెలుగులో అదే ఫీచర్‌కు సూపర్ స్టార్ మహేశ్‌ వాయిస్‌ని జోడించింది. అంటే ఇకపై బిల్ పేమెంట్స్‌ టైంలో…. మనీ రిసీవ్డ్ అంటూ సాధారణంగా వినిపించే కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ కాకుండా సూపర్‌స్టార్‌ వాయిస్ వినిపిస్తుంది.దీని కోసం మహేశ్‌ వాయిస్ తీసుకుని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా వాయిస్ ని జెనరేట్ చేశారట ఫోన్‌ పే సంస్థ ప్రతినిధులు. పేమెంట్ అయిన తర్వాత ‘ధన్యవాదాలు బాస్‌’ అంటూ వినిపిస్తుందని సమాచారం. ఇక మలయాళం కోసం మమ్ముట్టి, కన్నడ కోసం సుదీప్‌తో కలసి ‘ఫోన్‌ పే’ పనిచేయనుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version