కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన అన్ని హామీలను నెరవేర్చడం లో మేము ముందుంటాం అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 2008లో ప్రజల మనిషిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి RMPల కోసం అప్పుడు GO తీసుకొచ్చారు. వైద్యం శాస్త్రీయ బద్దంగా ఉండాలి. కొంతమంది వైద్యులు.. పరిమితికి మించి వైద్యం చేయడం వల్ల వైద్యం వికటించి చనిపోతున్నారు. అలాంటివి అరికట్టాలి. పదేళ్ళు ప్రాధమిక వైద్యాన్ని మంటగలిపారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేస్తున్నాం. రాజీవ్ ఆరోగ్య శ్రీ..వంటి పథకాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. CMRF, దాదాపుగా 30వేల చెక్ లను క్లియర్ చేసాము.
పదేళ్లపాటు కనీసం బాధలను చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. తప్పకుండా cm రేవంత్, నేను, కోదండరాం.. అందరం కలిసి చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటాం. లక్షల వేలకోట్ల అప్పులతో వాటికి వడ్డీలు కట్టుకుంటూ… రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ప్రభుత్వం పనిచేస్తున్నాం.. కుల సర్వే చేసాము.. భారత దేశంలో ఎక్కడ జరగలేదు.. తెలంగాణ లో జరిగాయి. ప్రజల కోసం పనిచేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ కి ఉంది. మంచి పని చెయ్యాలని అన్నా చట్టబద్దత ఇవ్వాలి.. అందుకు అనుగుణంగా పనిచేసి ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తాం. మీపై జరుగుతున్న దాడులపై కూడా ముఖ్యమంత్రి తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.