టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ సంస్థలు స్థాపించిన విద్యావేత్త మంచు మోహన్ బాబు రాజకీయ రంగంలో కూడా అద్భుతంగా అప్పట్లో రాణించడం జరిగింది. అప్పట్లో స్వర్గీయ నందమూరి రామారావు రాజకీయాల్లో ఉన్న టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోహన్ బాబు తెలుగు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఎన్టీఆర్ చనిపోవడంతో తెలుగు పాలిటిక్స్ నుండి మోహన్ బాబు కూడా పక్కకి వెళ్ళి పోవడం జరిగింది.
ఇటువంటి తరుణంలో మళ్లీ మోహన్ బాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో వై.ఎస్ జగన్ కోసం ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్. విషయం ఏమిటంటే ఇటీవల మోడీని మోహన్ బాబు కుటుంబ సమేతంగా కలవటంతో.. మోహన్ బాబు బీజేపీ లోకి వెళ్లి పోతున్నట్లు తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా భయంకరమైన ప్రచారం మొదలు పెట్టింది. దీంతో తనపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టే విధంగా రాబోయే స్థానిక ఎన్నికలలో వైసీపీ పార్టీ తరఫున కొన్ని ప్రాంతాలలో మోహన్ బాబు ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.