మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ అర్హత మొదలైన వివరాలు ఇవే…!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. ప్రజల్లో ఆర్థిక భద్రత పెంపొందించేందుకు కేంద్రం ఈ పథకాల్ని తీసుకు రావడం జరిగింది. అలానే కేంద్రం పోస్టాఫీస్ పథకాలు, LIC పథకాలు వంటి వాటిని ప్రజలకు చేరువ చేసింది.

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో మరో కొత్త స్కీమ్‌పై కూడా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఆ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలని ఇప్పుడే చూద్దాం. ఈ స్కీమ్ పేరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. వన్- టైమ్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఇది.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అర్హత వివరాలు:

ఈ స్కీమ్ లో మహిళలు లేదా ఆడపిల్లల పేరు మీద డిపాజిట్ చేసేందుకు అవుతుంది.
ఈ స్కీమ్ లో మీరు గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
మినిమమ్ ఎంత పెట్టచ్చు అనేది క్లియర్ గా తెలీదు.
దీనిపై 7.5 శాతం ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేటు వస్తుంది. అంటే 7.5 శాతం వడ్డీ ని ఈ స్కీమ్ ద్వారా పొందొచ్చు.
ఒకేసారి ఇందులో డబ్బులు పెట్టాలి.
2025 మార్చి వరకు ఇది అందుబాటులో వుంటుందట.
చిన్న పొదుపు పథకాల కంటే కూడా ఈ స్కీమ్ లో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు.
ఈ స్కీమ్ కి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది. రెండేళ్ల లాక్- ఇన్ పీరియడ్ ఉంటుంది. అలానే కావాలంటే మధ్యలో విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం వుంది.

ఎక్కువ వడ్డీ వస్తుంది….

దీనిపై 7.5 శాతం ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేటు వస్తుంది. అంటే 7.5 శాతం వడ్డీ ని ఈ స్కీమ్ ద్వారా పొందొచ్చు. చిన్న పొదుపు పథకాల కంటే కూడా ఈ స్కీమ్ లో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్స్ మనకి అందుబాటులో వున్నా దీని వలనే ఎక్కువ లాభం ఉంటుంది. 2023 జనవరి- మార్చి త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన కింద 7.6 శాతం వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ కింద అయితే 8 శాతం వడ్డీ వస్తుంది. కానీ ఇవి లాంగర్ లాక్- ఇన్ పీరియడ్ అంటే ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చెయ్యాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version