ఎడిట్ నోట్: కేటీఆర్ వర్సెస్ రేవంత్-సంజయ్.!

-

తెలంగాణలో రాజకీయ పోరు ఆసక్తికరంగా మారుతుంది..ఇంతకాలం సీనియర్ నేతలే రాజకీయాలని నడిపించిన పరిస్తితి..ఏ పార్టీలోనైనా సరే సీనియర్ నేతలదే హవా అన్నట్లు ఉండేది..ఇప్పుడు తెలంగాణలో పోరు మధ్య వయసు ఉన్న నేతల మధ్య మొదలైంది. మూడు ప్రధాన పార్టీలు..ముగ్గురు ఫైర్ బ్రాండ్ నాయకులు. ఇటు అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి కే‌సి‌ఆర్ అధ్యక్షుడు అయినా..సరే ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపుకు వెళ్ళడంతో..తెలంగాణలో రాజకీయాలని కే‌టి‌ఆర్ నడిపిస్తున్నారు. మొత్తం కథ ఆయనే నడిపిస్తున్నారు. ఓ వైపు పాలన చూసుకుంటూనే..మరో వైపు పార్టీని సమర్ధవంతంగా నడిపిస్తున్నారన్ఈ చెప్పవచ్చు.

అటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ఈ సారైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ కష్టపడుతున్నారు. మరోవైపు బి‌జే‌పి అధ్యక్షుడుగా బండి సంజయ్ ఉన్నారు. అసలు సంజయ్ అధ్యక్షుడు అయ్యాక తెలంగాణలో బి‌జే‌పికి కొత్త ఊపు వచ్చింది. బి‌జే‌పిని తొలిసారి తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని బండి పనిచేస్తున్నారు. ఇలా దాదాపు ఒకే వయసున్న ముగ్గురు నేతలు..తమ తమ పార్టీలని అధికారంలోకి తీసుకురావడం కష్టపడుతున్నారు.

ఇక రేవంత్-సంజయ్ టార్గెట్ బి‌ఆర్‌ఎస్ మాత్రమే..ఎందుకంటే ఆ పార్టీనే అధికారంలో ఉంది. ఓ వైపు రేవంత్ పాదయాత్ర చేస్తూ..బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఓ వైపు ప్రీతి ఇష్యూ, మరోవైపు వీధికుక్కల అంశం, అలాగే ఢిల్లీ లిక్కర్ ఇష్యూ..ఇలా కొన్ని అంశాలని టార్గెట్ చేసి..బి‌ఆర్‌ఎస్ సర్కార్ పై రేవంత్ గాని, బండి గాని ఫైర్ అవుతున్నారు. ఈ ఇద్దరు తమదైన శైలిలో బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

ఇదే సమయంలో కే‌టి‌ఆర్ ఒక్కరే వారికి కౌంటర్లు ఇస్తున్నారు. కే‌సి‌ఆర్ పెద్దగా మీడియా వైపు కనిపించకపోవడం, జాతీయ రాజకీయంపైనే ఫోకస్ పెట్టడంతో..అన్నీ కే‌టి‌ఆర్ చూసుకుంటున్నారు. విపక్షలకు కౌంటర్లు ఆయనే ఇస్తున్నారు. ప్రీతిడి ఆత్మహత్య కాదని, ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని ఇటు రేవంత్, అటు బండి..ఫైర్ అయిన విషయం తెలిసిందే. దీనిక్ఈ కే‌టి‌ఆర్ కౌంటర్ ఇస్తూ..వేధింపులకు గురై మృతి చెందిన ప్రీతి విషయంలో కొందరు కావాలని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయిన వదిలిపెట్టేది లేదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. అసలు వాళ్ళు తెలంగాణకు పట్టిన దరిద్రం అంటూ రేవంత్, బండిలపై ఫైర్ అయ్యారు. మొత్తానికి రాను రాను తెలంగాణ రాజకీయాలు..కే‌టి‌ఆర్-రేవంత్-బండిల మధ్య వార్ మాదిరిగా నడిచేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version