మహీంద్ర మరాజో గ్రేట్ లాంచింగ్

-

మహీంద్ర అండ్ మహీంద్ర మల్టీ పర్పస్ యుటిలిటీ వెహికల్ మరాజో ను సోమవారం గ్రేట్ లాంచింగ్ చేసింది. గతంలో స్కార్పియో వాహనం మహీంద్రకు ఎంత మైలు రాయిగా నిలిచిందో అదే స్థాయిలో మరాజో అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.  మరాజో అంటే స్పానిష్ భాషలో షార్క చేప అని అర్థం.. ఇటాలియన్ డిజైన్ హౌస్ పిన్ ఇన్ ఫెరీరా సౌజన్యంతో డిజైన్ని, ఉత్తర అమెరికాలోని డిట్రాయ్ టెక్నికల్ సెంటర్, చెన్నైలోని మహీంద్ర రీసెర్చ్ వ్యాలీ భాగస్వామ్యంతో ఇంజన్ ను రూపొందించినట్టు కంపెనీ తెలిపింది.

1.5 లీటర్ల సామర్థ్యం గల ఎమ్ ఫాల్కన్ డీజిల్ ఇంజన్, 6స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్, 120 బీహెచ్పీ పవన్ , 300 ఎన్ఎమ్ టార్క్ చేయనుంది. మల్టీ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాకింగ్ సిస్టం,  ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్స్ గల 7 ఇంచుల టచ్ స్క్రీన్, ఆకట్టుకునే ఇంటీరియర్ని రూపొందించారు. మొత్తం నాలుగు వేరియంట్లలో ఎం2, ఎం4, ఎం6, ఎం8 లలో ఇది అందుబాటులోకి రానుంది. ప్రారంభ ధర 9.99 లక్షల నుంచి 13.90 లక్షలు (ఎక్స్ షోరూం) గా నిర్ణయించారు. టయోటా ఇన్నోవా క్రిస్టా, టాటా హెక్సా, ఫోర్డ్ ఎండీవర్లకు గట్టిపోటీ ఇవ్వనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version