బిజెపికి సైలెంట్ షాక్ ఇచ్చిన మజ్లీస్… తెరాసకు మద్దతు

-

కాసేపటి క్రితం ప్రారంభమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో తెరాస కార్పొరేటర్ లే మేయర్, డిప్యూటి మేయర్ గా ఎన్నికయ్యారు. గద్వాల విజయలక్ష్మి పేరును టిఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ప్రతిపాదించగా… గాజుల రామారం కార్పొరేటర్ రావు శేషగిరి రావు బలపరిచారు. ఆ తర్వాత డిప్యూటి మేయర్ గా మోతే శ్రీలత రెడ్డిని ఎంపిక చేసారు.

దీనికి కూడా మజ్లీస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే మేయర్ పదవి ఆశించి… ఖైరతబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి భంగపడ్డారు. ఆమె పీజేఆర్ కూతురు కాగా ఆమెకు మేయర్ పదవి ఇవ్వాలని చాలా మంది కోరినా సరే కేకే కుమార్తెని ఎంపిక చేసారు. మేయర్ పదవి ఆశించి భంగపడ్డ విజయ రెడ్డి… గత ఎన్నికల్లోనూ మేయర్ పదవి ఆశించారు. ఆమె కార్యాలయం నుంచి ఆమె అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు.

విజయ రెడ్డి ని బిలుజ్జగించేందుకు రంగంలోకి దిగిన టీఆర్ఎస్ నేతలు… ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని తెలిసింది. ఇక మజ్లీస్ పార్టీ అనూహ్యంగా తెరాస పార్టీకి మద్దతు ఇవ్వడంతో బిజెపి షాక్ అయింది. ఇప్పటి వరకు తెరాసపై విమర్శలు చేసిన మజ్లీస్ మేయర్ ఎంపికలో తెరాసకి మద్దతు ఇవ్వడం సంచలనం అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version