కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు ఊహించని షాక్ తగిలింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమా సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది పాన్ ఇండియా తమిళ్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ధనుష్ డజను సినిమాలలో నటిస్తూ తగ్గేదే లేదంటున్నాడు. తమిళ్ ,హిందీ, తెలుగు తో కలిపి డజన్ సినిమాలలో నటిస్తున్నాడు.

కాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమా సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ సినిమా కోసం వేసిన సెట్‌లో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తేని జిల్లాలోని అండిపట్టిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సెట్‌లోని కీలక సామగ్రి కాలిపోయినట్టు తెలుస్తోంది.