ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే నేపథ్యంలో… బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ గ మారింది. “నేతలు ఎందరో ఉంటారు… కానీ నేతగా జన్మించి, నేతల్లో నేతగా నిలిచినవాడు ఒక్క చంద్రన్న! అంటూ ట్వీట్ చేశారు. సైబరాబాద్, అమరావతి, అభివృద్ధి.
ఇవన్నీ చంద్రన్న సృష్టించిన చరిత్రలు! ఇది కేవలం పుట్టినరోజు కాదు… ఒక యుగానికి జరుపుకునే శుభదినం అని వెల్లడించారు. జై చంద్రన్న జపం చేశారు బండ్ల గణేష్.
అటు చంద్రబాబు బర్త్ డే నేపథ్యంలో…డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ ట్వీట్ చేశారు. ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం అన్నారు.