మే 15వ తేదీ నుంచి తెలంగాణలో పుష్కరాలు.. కీలక ఆదేశాలు ఇవే

-

తెలంగాణ సరస్వతి నది పుష్కరాలు జరపడానికి రేవంత్ రెడ్డి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పుష్కరాలకు సంబంధించిన పోస్టల్ ను వెబ్సైట్ మొబైల్ యాప్లను మంత్రులు ఆవిష్కరించారు. ఈ పుష్కరాలకు నిత్యం భక్తులు 50 వేల నుంచి లక్ష వరకు వచ్చే సూచనలు ఉన్నాయని, వారికి అందుబాటులో మంచినీటి సౌకర్యం మరియు మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు.

Pushkaram in Telangana from May 15th

తెలంగాణ సర్కార్ ఆలయాలపై అభివృద్ధి దృష్టి సాధిస్తుంది. ఈ క్రమంలో కాలేశ్వరం సరస్వతి నది పుష్కరాలను ఆవిష్కరించడం ఉన్నది. దీనికి సంబంధించి సోషల్ మీడియా ఆవిష్కరించారు. మంత్రి సురేఖ. శ్రీధర్ బాబు. పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని ప్రకటించారు. గత ప్రభుత్వం యాదగిరిగుట్ట మినహా అన్ని దేవాలయాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. కొండ సురేఖ తమ ప్రభుత్వం వచ్చాక అన్ని దేవాలయాలు అభివృద్ధి చెందిస్తున్నామన్నారు. ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. దానిలో భాగంగానే మే 15 నుoడి 26 వరకు పుష్కరాలు జరుగుతాయన్నారు. 35 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు.

కాలేశ్వరంలో 17 అడుగుల సరస్వతి ఏకశిల విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ 12 రోజులు కాశీ నుంచి వచ్చే పండితులతో హోమాలు యాగాలు జరపనున్నారు. మంత్రి సురేఖ తెలంగాణలో కాలేశ్వరం త్రివేణి సంగమం అన్నారు. శ్రీధర్ బాబు ప్రణహితతో కలిసి సరస్వతి అంతరిహనిగా ప్రవహిస్తుందని చెప్పారు. 2013లో తమ హయాంలోనే పుష్కరాలు జరిగాయని. మళ్లీ ఇప్పుడు జరుగుతున్నాయని ఆనందం కొద్ది ఉన్నారు. ఈ పుష్కరాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. చత్తీస్గడ్.మహారాష్ట్ర.రాష్ట్రాల నుండి భక్తులు వస్తారని వారికి వంద పడకల టెంట్ హౌస్ ని ఏర్పాటు చేశారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news